Categories
ఇంట్లో చేసుకొనే కొన్ని మిశ్రమాలతో ఖరీదైన కాస్మోటిక్స్ కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు పావు కప్పు అలోవీరా జెల్ ని పావు కప్పు కొబ్బరి నూనె ను వేడి చేసి ఆ క్రీమ్ ని జుట్టూ కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించి ఓ ఇరువై నిమిషాలు ఆరబెట్టి తల స్నానం చేస్తే జుట్టూ పట్టులా మెత్తగా ఉంటుంది. చాకు ను మరుగుతున్న నీళ్ళలో వేసి ఆ వేడిగా ఉన్న చాకుతో చీజ్,కాటేజ్ చీజ్ లు కట్ చేస్తే అవి పొడిగా కాకుండా నీటిగా ఉంటాయి. పండ్లు, కూరగాయాలు ద్వారా సి విటమిన్ తీసుకొంటే వాళ్లకి గుండె జబ్బులు రావని కోపెన్ హగన్ విశ్వ విద్యాలయ పరిశోధకుల రిపోర్ట్. ముడి ధాన్యాలు, చిలకడ దుంపలు వంటి నెమ్మదిగా ఈర్నం అయ్యే పిండి పదార్థాలను తీసుకొంటే చక్కర శాతం పెరగదు.