నీహారికా.

లైఫ్ పట్ల అనుకూల దృక్పదం గలవారు ఆరోగ్యంగా వుంటారనే విషయం శాస్త్రీయంగా రుజువైంది. మనం హాయిగా నవ్వినప్పుడుడల్లా మెదడు మంచి భావాలను ఇచ్చే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇలాగే జీవితం కాస్తంత సంతోషంగా చైతన్యంగా వుంచుకోగాలిగితే చాలు మిగతా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మనం ఇంట్లోనుంచి కాలు బయట పెట్టినప్పుటి నుంచి, సమూహాల మద్యని ఉంటాం. ప్రతి నిమిషం మన్యుషుల తో ఇంటరాక్షన్ తో వుండాలి. అదే చాలా కష్టమైన సమస్య. మన పని మనం చేసుకోవాలి. చుట్టూ వున్న వారితో శ్రద్దగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా మెలగాలి. ఇది నిమిషం ఎలర్ట్ గా వుండటంతో పరిష్కారం అయ్యే సమస్య కాదు. అనుకూల దృక్పదం అలవర్చుకుంటే మనం మన చుట్టూ వున్న మన్యుషులు అందరు బావుంటారు.

Leave a comment