Categories
అంచులో జరీ లేనిదే చీరకు అందమే లేదు. ఇందులో నాలుగు రకాలున్నాయి. బంగారు జరీ, టెస్టెడ్ జరీ, పౌదరీ జరీ, నీం జరీ, రిబ్బన్లు, ఎంబ్రాయిడరీలు అల్లికలు, లేసుల్లో నీమ్ జరీ వాడతారు. ఇన్ని రకాల జరీ ని ఉత్పత్తి చేయడం అయ్యాక దాన్ని వస్త్రాలపై తీర్చిదిద్దడం మరో ఎత్తు. జర్దోసీ, మీనా కటీక, కినారి ఇలా వివిధ రకాల జరీ వర్క్లకు సాధారణంగా సూరత్ నుంచి జరీ ని దిగుమతి చేసుకుంటారు. చెన్నాయ్ మైసూర్, బెంగుళూర్, సేబం, మదురై, కాంచీపురం జరీ ఉత్పత్తుల్ని తయ్యారు చేస్తుంటారు. జరీ చీరలు, పంచేలతో పాటు జరీ ఎంబాయిడరీ పర్సులు , కుషన్ కవర్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు ఎన్నో తయ్యారావ్వుతున్నాయి. కేవలం జరీ తోనే ఎన్నో కొత్త ఉత్పత్తులు ఫ్యాషన్ సెగ్మెంట్స్ ప్రాణం పోసుకుంటే ఆశర్యం లేదు.