బొప్పాయి తియ్యని పండు బీటాకెరోటిన్, లికోపెనెలకు బొప్పాయి ఆదారం. ఏడాది పోరవునా దొరికే ఈ బొప్పాయి జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది అంటున్నారు స్పెషలిస్టులు కొన్ని బొప్పాయి ముక్కల్లో అలివ్  నూనె, కొబ్బరి నూనె కలిపి గుజ్జుగా గ్రయిండ్ చేసి, ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళు వరకు పట్టించి ఓ అరగంటకి స్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ దొరుకుతుంది. అరకప్పు బొప్పాయి గుజ్జుకు నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు చాలా వరకు పోతుంది. బొప్పాయి గుజ్జులో కొబ్బరి పాలు, తేనె కలిపి, జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆరిపోయాక, తలస్నానం చేస్తే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది. కుదుళ్ళు బలంగా ఉంటాయి.

Leave a comment