పండగలకీ, పబ్బాలకీ ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. వారంలో దేవుళ్ళ పేరున కొన్ని రోజుల ఉపవాసం చేసే వాళ్లున్నారు. మరి ఉపవాసం తర్వాత ఏం తింటే ఉపవాసం వల్ల అందె ప్రధాన ప్రయోజనం అంటే జీర్ణ వ్యవస్ధ శుభ్ర పడుతుంది? ఉపవాసం వెంటనే ఏం తింటే శక్తి సమకూరుతుందీ అంటే, ఆహారం చాలా తేలిగ్గా అరిగి పోవాలి. తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పని సారి. ఈ రసంలో పంచదార ఉండకూడదు. పచ్చని కూరగాయలు, ఆకుల తో చేసిన సలాడ్ వుండి తీరాలి. ఒక గిన్నె పెరుగు తప్పని సరిగా వుండాలి. పప్పులు, తృణ ధాన్యాలతో చేసిన ఆహారం మంచిది. భిజనం తో పాటే నట్స్ తినాలి. ఉపవాసం చేసిన రోజంతా నీళ్ళు పోషకాలతో కూడిన ద్రవనాలు తీసుకుంటూ డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఉపవాసం వెంటనే మసాలా ఆయిల్ ఫుడ్ మాత్రం తీసుకోకూడదు. వేయించిన పదార్ధాలు, ఎక్కువ కేలరీలు వుండే మిఠాయిలు తీసుకుంటే ఉపవాస ప్రయోజనం పూర్తిగా పోయినట్లే.
Categories