నీహారికా, చాలా మందిలో ప్రతి దానికి వాదించే ధోరణి వుంటుంది ఎవరేం చెప్పినా సరే చటుక్కున వాదించి కండించేస్తారు. ఇలాంటి వ్యక్తులతో సామాజిక సంబందాలు చాలా కష్టం. వారి వాదనలకు , ఖండనలకు, చర్చలకు ప్రతిస్పందించక పోవడమే సరైన మార్గం. ఇలా వాదించే తత్త్వం ముందు వాళ్ళ ఆరోగ్యానికే ముప్పని స్నేహితులతో ఇంట్లో వారి తో గొడవలకు దిగేవాళ్ళలో రక్త పోతూ అవకాశాలు చాలా ఎక్కువ. స్ట్రెస్ హార్మోన్స్ వీరిలో ఎక్కువ విడుదల అవ్వుతుంటాయి. డిప్రెషన్ లక్షణాలు ఎక్కువే. అసలు ఇలాంటి లక్షణాలున్న వాళ్ళని భారిచడానికి ఎవ్వరూ ఇష్ట పాడారు కనుక స్నేహితులు దూరం అవ్వుతారు. అంచేత ప్రేమా రాహిత్యం లో బాధ పడుతూ ఇంకా ఎక్కువ వ్యతిరేకత కనబరుస్తూ వుంటారు. వీళ్ళని ప్రత్యేకంగా పనికట్టుకుని మార్చలేం కనుక వదిలేయాలి. చివరకు ఇలా గొడవ పడే వాళ్ళని గుర్తుంచుకుని వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి కానీ అది ఇతరుల వల్లయితే కాదు. ఆసలలాంటి స్వాభావం ఉన్న వాళ్ళు చాలా తొందరగా తామం ప్రవర్తనని మార్చుకోలేక పొతే బాధ పాడేది నష్టపోయేది వాళ్ళే.
Categories