బి. పి పెరుగుతుంది అనిపిస్తే ముందు చేయవలసిన పని ముందు నియంత్రణ లో ఉంచుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం మొట్టమొదటిగా చేయవలసిన విషయం. ఇంకా ఆ తర్వాత ఆహార నియంత్రణ పాటించాలి. వెన్న, నెయ్యి, ఫ్యాట్ మిల్క్, కేకులు, బిస్కెట్ లు వదిలేయాలి. ప్రాసెస్డ్ పదార్ధాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. సరైన బరువులో ఉంటే రక్త పోటు సాధారణ నియంత్రణలో ఉంటుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, సహజ ఓట్స్ ఉత్పత్తులు, బార్లీ తప్పనిసరిగా తీసుకోవాలి. కనీసం రోజుకు ఐదు సర్వింగ్స్ తీసుకోవాలి. పండ్లు కూరగాయలు ఒక సర్వింగ్ లో తీసుకోవాలి. ప్రతి సారి భోజనం తో పాటు క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు ఆకు కూరలు, ఉంటే సరైన ఆరోగ్యవంతమైన భోజనం, డార్క్ చాకోలెట్స్, వాల్ నట్స్ మంచివే. నిద్ర బాగా పోవాలి.
Categories