Categories
ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్ ఛాతిలో ఉంటే తల మెడ భుజాలు వెన్నునొప్పి తప్పవు. ముఖ్యంగా స్త్రీ లకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్క చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందస్తు మడతలు తప్పవు. సాధారణంగా మెడ పైగల చర్మానికి నలభై ఏళ్ళు దాటాక వర్దాక్యా వస్తాయి. కానీ ఇప్పుడు 18 నుంచి 36 ఏళ్ళ మధ్య లో ఆడవాళ్ళకు ఈ సమస్య ఆరంభం అవ్వుతుంది. రోజుకు 150 సార్లు ఈ బుల్లి పరికరం వాడటం ఫోన్ , టాబ్లెట్ వైపు మెడ వంచి చూడటం వల్లనే మెడ చర్మం సాగిపోతుంది అని . ఎక్కువసేపు తలవంచి ఉండటం వల్ల మెడ కండరాలు స్ట్రయిన్ అయ్యి మృదువైన టిష్యులు కాంట్రాస్ట్ అవ్వుతాయి కనుక తరచూ బ్రేక్స్ తీసుకోవాలి . కళ్ళకు సమాంతరంగా ఫోన్ చూడటం అలవాటు చేసుకుంటే సమస్య తీవ్రత కొంత తగ్గుతుంది.