Categories
ఆహారంలో మార్పులు చేసే స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యాయినాలు చెప్పుతున్నాయి. 3500 మంది స్త్రీల పైన చేసిన ఒక అధ్యాయినంలో ఆలివ్ నూనె ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని తేలింది. శాఖాహారం వల్ల రొమ్ము కాన్సర్ ముప్పు తగ్గొచ్చని ఇంకొ అధ్యయనం చెప్పుతుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా వుండే చాపలు , వాల్ నట్స్ , గింజలు ఆహారం లో చేర్చుకోవాలి. క్యాబేజీ , కాలీ ఫ్లవర్ , ఉల్లి , వెల్లుల్లి , పుట్ట గొడుగులు కూడా కాన్సర్ ను నిరోధించే పోషకాలున్నాయి. అలాగే కొంత సొయా కూడా ఆహారం లో చేర్చుకో వచ్చు.