నీహారికా ,
చాలామంది తమ పిల్లల్ని గురించి చాలా గొప్పగా మా అమ్మాయి ఒక్క పని చేసుకోలేదు అనో , మా అబ్బాయి టూ వీలర్ మీద ఒక రైడ్ వేసాడని పన్నెండేళ్ళ పిల్లాడి గురించి గొప్పగా చెప్పడం. ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకో కారు కొనిస్తా నాన్నా అని చెప్పడం. ఇది ప్రేమ కంటే ఎక్కువ గారాబం చేయడం. అవధులు దాటిన మురిపెం. అంత చిన్న వాటికి టూ వీలర్ ఇవ్వడం కార్లు కొనివ్వడం తమ పని తాము చేసుకోలేని ప్రేమ తో పెంచడం ఇవన్నీ పిల్లల విషయంలో చేస్తున్న పొరపాట్లు పిల్లల విషయం లో చేస్తున్న పొరపాట్లు. పిల్లల విషయం లో ప్రేమతో వాళ్ళ చుట్టూ ప్రేమతో గోడ కట్టేస్తున్నారని అనుకుంటున్నారు కానీ వాళ్ళని ఈ ప్రపంచం లో తమ కాళ్ళ పైన తాము నిలబడగలిగే స్ధిమితం తో పెంచడం లేదని అర్ధం చేసుకోరు. పిల్లలని ప్రేమించడం తప్పు కాదు. స్వేచ్ఛ ఇవ్వడం తప్పు కాదు. పిల్లల ని చక్కగా ఎదుగుతున్న మొక్కల లాగా చూడాలి. హాయి గా పెరగనిచ్చి ప్రోత్సహించి , వాళ్లు ఎలా పెరుగుతున్నరో ఒక్క కంట కనిపెట్టి క్రమ శిక్షణ తో పెంచి వాళ్ళను జీవితానికి సిద్ధం చేయాలి అదీ ప్రేమంటే.