Categories
స్మార్ట్ ఫోన్ అతిగా చూసే పిల్లలలో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు దక్షిణ కొరియా పరిశోధకులు.ఈ కాలంలో చిన్న పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు అతుకున్నాయి.పెద్ద వాళ్ళు పిల్లల అల్లరి తప్పించుకోవడానికి ఫొన్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ సరదా పిల్లలకు హాని చేస్తుందంటున్నారు పరిశోధకులు.ఐదేళ్లు నుండి 12 సంవత్సరాల పిల్లలపై ఈ పరిశోదన చేస్తే వారిలో 20 శాతం మందికి మెల్లకన్ను ,కంటిచూపులో తేడాను కనిపెట్టారు.చిన్న వయసు వారు స్మార్ట్ ఫోన్ అతి దగ్గర నుంచి చుడడమేఇందుకు కారణమని ,కనీసం 20 నుంచి 30 cm దూరంలో స్క్రీన్ ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు.పిల్లలకు అరగంటకు మించి స్మార్ట్ ఫోన్ చెతికి ఇవ్వొదంటున్నారు.