నీహారిక, ప్రతిపూట ఎక్కడో ఒకచోట బాలికలపై అఘాయిత్యాలు జరగడం న్యూస్ లో వస్తునే ఉంది. కామాంధులు వావివరసలు ,వయస్సుతో సంబంధం లేకుండా పసిబిడ్డలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. స్కూల్ , బస్సుల్లో పంపాలన్న చివరికి ఉపాధ్యాయుడి దగ్గరకు ట్యూషన్ కు పంపాలన్న తల్లిదండ్రుల గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. ఒక వేళ ఏదైనా సమస్య ఎదురైనా కాని స్నేహితులకు, బంధువులకు చెప్పుకోవాలంటే భయపడతారు. అలగే లైంగిక వెధింపులకు గురైనా పిల్లలు కూడా వాళ్ల పసితనం వల్ల ఆ హింసకు పాల్పడిన వారి బెదిరింపులకులోనై నోరెత్తి ఇళ్లలో కూడా చెప్పని పరిస్థితులున్నాయి. నిపుణులు అయితే పిల్లలకు పసితనం నుంచే మార్షల్ ఆర్ట్స్, కరాటే వంటివి నేర్పించాలని కరాటే నేర్చుకున్న అమ్మాయిల్లో చాలామంది తమను తాము రక్షించుకోగలమనే ఆత్మ విశ్వాసం పెరుగుతుందని కరాటే నిపుణులు అంటున్నారు. వాళ్లకు వాళ్ల శరీరం పట్ల తల్లిదండ్రులే అవగాహన పెరిగేలా చేయాలని , వాళ్లను వాళ్లు కాపాడుకోనేలా తయారు చేయాలంటున్నారు. కాని నిజంగా వాళ్లు వాళ్లు కాపాడుకోగలరా ?
Categories