Categories
ఇప్పటి వరకు బరువు ఎక్కువగా ఉంటే డిప్రెషన్ అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య ఒక అధ్యయనం బరువు తక్కువగా ఉన్న స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. బరువు తక్కువగా వుండటం వారిలో మానసిక అశాంతికి దారి తీస్తోందని చెప్తుతున్నారు. ఈ శారీరక బలహీనత అంటే సన్నగా ఉంటే అనారోగ్యంగా శక్తి హీనంగా ఉన్నామనుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతున్నారట. సాధారణంగా పోషకాహార లోపం, నిద్ర లేకపోవడం ,శారీరక అనారోగ్యం వంటివి కూడా శరీరపు బరువు పెంచవనీ దీన్నీ కారణంగా తీసుకుండా కేవలం బరువు లేక పోవడం పెద్ద లోపంగా తీసుకోని మానసిక అశాంతితో బాధపడతారని అధ్యయనం చెపుతోంది. అంటే బరువు ఎక్కువున్న తక్కువున్న ఆ అలోచన కూడా అ శాంతికి కారణం అవుతోందన్నమాట.