నీహారికా,
చాలా మంది పెద్ద వాళ్లు, పిల్లలు కూడా బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . చుట్టూ జీవితం ఇంత గొప్పగా నడుస్తూ ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయం అనుభవంలోకి వస్తూ ఉంటే బోర్ అనే పదం ఎంత అనవసరంగా వాడుతున్నారో అనిపిస్తోంది. ఒక సద్గురు ఏమంటారంటే ఈ సకల సృష్టిని మొత్తం తేరిపారా చూసేసి అస్సలు ఇంక చూసేందుకు ఏమీ లేదు అంటే అప్పుడు విసుగోస్తోంది అనోచ్చట. మనంకు విసుగోస్తే ఆఫీస్ మార్చుకోవచ్చు, చేసే వృత్తిని మార్చుకోవచ్చు కాని మన కుటుంబాన్ని మార్చుకోలేము కదా. అందువల్ల మన ఆలోచనలో తేడా రావాలి . మన చుట్టు జరుగుతున్నా విషయాల్ని ఆసక్తిగా చూడాలి. జీవితం ఎన్నో రంగుల పోగులతో చక్కగా నేసిన అందమైన వస్త్రం ఇందులో ఎన్ని పోగులు ,సోగసులు అల్లికలు ఎంత చూసిన విసుగు రానంత అందం. అంచేతా జీవితాన్ని ప్రేమిస్తే, మన జీవిత విధానాన్ని ప్రేమిస్తే మరింత అందంగా ఉండేలా తీర్చీరిద్దుకుంటే అసలు బోర్ అన్న పదం మన నిఘంటువులోంచి పారిపోతుంది.
Categories