Categories
పాలు,పండ్లు కూరగాయాలు పిల్లలు ఇష్టపడకపోతే కష్టంగా ఉంటుంది. పౌష్టికాహరం ఎలా ఇవ్వాలి అని ఆందోళన పడుతుంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు పండ్లు తినక పోతే వాటిని ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వండి. జ్యూస్ గా లేదా రకరకాల పండ్ల రసాలతో ఐస్ క్రీమ్ ఇంకా ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు . అలాగే పాలు ఇష్టం లేక పోతే మిల్క్ షేక్ చేసి ఇవ్వొచ్చు. కూరగాయాలు తినక పోతే వెజిటెబుల్ ఆమ్లేట్ ,ఇంకా కూరగాయాల ముక్కలతో నూడిల్స్ చేసి ఇవ్వచ్చు. పాలు,పండ్లు అదే రూపంలో ఇవ్వలని రూలేం లేదు. వాళ్ళు దోసెలు తినాలనుకుంటే ఈ ముక్కలన్నీ దోసెపిండిలో మిక్స్ చేసి చక్కని దోసెలు వేసి ఇవ్వచ్చు. రూపం ,రుచి మారుతుంది. వాటిలో పోషకాలు పోవు కదా!.