Categories
Gagana

ఎప్పుడు నేర్చుకొంటూనే

చాలా మంది చిత్ర రంగంలోకి మరీ చిన్నవయసులోనే వచ్చారు కమల్ హాసన్ తో సహా. వాళ్ళందరికి సినిమా సెట్టింగ్ లే కళాశాలలు అక్కడ నేర్చుకొన్నవే పాఠాలు. ఈ జీవిత పాఠాలతో వాళ్ళు నిజంగా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు కూడా. ఈ గ్రూప్ లోనే తమన్నా కూడా ఉంది. స్కూల్ డేస్లోనే చిత్రరంగానికి వచ్చాను ,పాఠాలు చదవటం ,పరీక్షలు రాయటం ఫలితాల కోసం చూడటం వంటి సగటు విద్యార్థుల అనుభవాలన్నీ సినిమాల ద్వారానే చూశాను అంటుంది తమన్నా. ప్రతి చిత్రంతోనూ ఏదో ఒకటి నేర్చుకొంటూనే ఉన్నా. బాహుబలిలో కత్తి యుద్ధాలు ,గుర్రపు స్వారీ నేర్చుకున్న . నా నువ్వే కోసం నృత్యం ప్రాక్టీస్ చేశాను.సైరా నరసింహారెడ్డి కోసం  ఆ కాలం  నాటి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్న అంటుంది తమన్నా. నిరంతర అభ్యాసం  జీవితానికి మరింత మెరుగు పెడుతుంది కదా!.

Leave a comment