సాధారణంగా పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి డౌట్ ముందుగా ఆభరణాలు కొనాలా,డ్రెస్లు కొని మ్యాచింగ్ గురించి ఆలోచించాలా అని .అయితే ముందే డ్రెస్ లు సెలక్ట్ చేసుకొమని చెప్తారు ఎక్స్ పర్ట్స్  లు, తర్వాత ఆభరణాలు తీసుకొనే జ్యూవెలరీ పెళ్ళీ వంటి ప్రత్యేక సందర్భాల్లో వేసుకొనే దుస్తులకు సరిపోవాలి. ఏ ఆభరణాలు ఎంచుకోవాలి అన్నది డ్రెస్ తో ముడిపడి ఉంటుంది. నెక్లిక్ పోడవుగా ఉండాలా ? బౌజ్ నెక్ లైన్ ఫలానా రకంగా ఉన్నప్పుడు ఏ నగ సరిగ్గా మ్యాచ్ అవుతుందీ చూసుకోవచ్చు. ఆభరణాలు ఎంతో కాలం వినియోగంలో ఉంటాయి కనుక అంతకు ముందే కొని ఉంటే వాటిని ఎదురుగా ఉంచుకొని డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి. పోడవాటి హారం ,పొట్టిగా నెక్లెస్ వీటిని సరిగ్గా చూపించుగలగే బ్లౌజ్ డిజైన్ ఎంచుకోవటం సులభం .అయితే ఈ రెండు పరస్పరం మ్యాచ్ అవ్వాలి.

Leave a comment