ఎండకాలం ఫ్రీజ్ తో నిరంతరం పని ఉంటుంది. పదార్ధాలతో ఫ్రీజ్ కిక్కిరిసిపోతే బాక్టీరియా వస్తుంది. ముడి సరుకు ప్రాసెస్ చేసినవి, ఫ్యాకేజ్ ఫుడ్ లను విడివిడిగా పెట్టుకుంటే ఈ సమస్య రాదు. ఫ్రీజ్ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. తరిగిన కూరలు,తినే పళ్ళు, జ్యూస్ లు వెంట వెంటనే వాడేస్తూ ఉండాలి. వండిన పదార్ధాలను ఫ్రీజ్ పై అరలో ముడి పదార్ధాలను ఫ్రీజ్ కింది అరలో ఉంచుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు విడిగా 18 డిగ్రీల సెల్సియస్ ఉండే డీప్ ఫ్రీజ్ లో ఉంచుకోవాలి. ఓపెన్ చేసిన టిన్ లు గట్టి మూత ఉన్న బాక్స్ లో పెట్టి ఫ్రీజ్ లో పెట్టాలి. ప్యాకేజ్ ఫుడ్స్ కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ తో తయారు చేస్తారు కనుక అవి జాగ్రత్త చేసే ముందే ప్యాకింగ్ ఎలా ఉందో పగిలిపోయిందా కరక్ట్ గా ఉందో చెక్ చేయాలి.
ఫ్రీజ్ లో సరిగ్గా అమర్చి పెడితే బాక్టీరియా సమస్య రాదు.
Categories