విటమిన్లు, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ లేకపోతే చర్మం నిర్జీవమై సాగిపోతుంది. అలగే కళ్ళ విషయంలో కూడా కెరోటినాయిడ్ వల్ల కలిగే మా క్యూలర్ డీ జనరేషన్ అడ్డుకోవాలంటే ఓ గుడ్డు కావాలి. చర్మం సాగకుండా దృఢంగా మృదువుగా ఉండాలంటే గడ్డు చాలా మంచిది. చర్మానికి మేలు చేసే ప్రోటీన్, బయోటిన్ దీనిలో సమృద్దిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే కేటరాక్ట్ రిస్క్ తగ్గిపోతుంది. హై క్వాలిటీ ప్రోటీన్ తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్ లను తగ్గించటంలో గుడ్డు ప్రయోజన కరంగా ఉంటుంది. ఇందులో ఉండే మూడు వందల మైక్రో గ్రామ్స్ కొలైన్ నాడి వ్యవస్థను కార్డియో వాస్క్ లర్‌ వ్యవస్థను క్రమబద్దికరించగలుగుతుంది.

Leave a comment