Categories

ఈ ఎండల్లో చెమటకు తడిసి నూనె అతుక్కుపోయి చుండ్రు తలెత్తుతూ ఉంటుంది. ఇంట్లో చేయగలిగిన చిట్కాలతో చుండ్రు మాయం చేయవచ్చు. గసగసాలు పాలలో నూరి తల పై పూస్తే చుండ్రు తగ్గుతుంది. మందార పూల రసం, సమానంగా నువ్వుల నూనె కలిపి మరగనిస్తే నూనె మిగిలిపోతుంది. ఈ నూనెతో తలపై మర్ధన చేయవచ్చు. అలాగా వేప నూనె, కానుక నూనె, కర్పురం కలిపి రాసినా మంచిదే. ఇక అన్నింటికంటే త్రీ ఫల చూర్ణం అద్భుతంగా పని చేస్తుంది దీన్ని తలకు పట్టించి ఓ అరగంట పోయాక తల స్నానం చేస్తే చుండ్రు సమస్య రాదు. మెంతులు, పెరుగు కలిపి మెత్తగా నూరి తలకు పట్టించినా చుండ్రు పోతుంది. జుట్టు మెత్తగా సిల్క్ లాగా ఐపోతుంది.