Categories
![చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.](https://vanithavani.com/wp-content/uploads/2017/02/alovera.jpg)
ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం. అలాగే బొప్పాయి గుజ్జు కుడా. ఈ రెండు రకాల గుజ్జులు చర్మాన్ని యధాస్థితికి తెస్తాయి. ఎండలో నుంచి బయటకు రాగానే దోస రసం, పుచ్చకాయ రసం కలిపి ఆ నీటిలో దూది తడిపి మొహనికి , మెడకు రాసి కాసేపు ఆగి కడిగేయాలి. పాలలో దూది ముంచి మొహం తుడిచిన మలినాలు పోయి చర్మం మృదువుగా అవుతుంది. మాయిశ్చరయిజర్ కూడా మంచిదే ఎస్ పీ ఎఫ్ 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్ రాసుకుంటే ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుంది.