Categories
దయా దాక్షిణ్యాలకు ఈ ప్రపంచంలో ఎంతో చోటు ఉందని నిరూపించింది ఈ సంఘటన .మాయా మహమ్మర్ చిన్న పాప ఆమె తండ్రికి లాగే ఆమెకు పుట్టుకతో కాళ్ళు లేవు. కృత్రిమ అవయవాలు అమర్చుకోనే ఆర్ధిక స్థోమత లేదు. పిల్ల కదల లేక పోవటం చూసి భరించలేక అందుబాటులో దొరికిన ప్లాస్టిక్ రబ్బాలతో ఆ పాపకు కాళ్లు లాగా అమరిక చేశారు. ఆ ప్లాస్టిక్ డబ్బాలతో మాయా నడవటం ఫోటో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ చిన్నారి మీద ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని కదిలించింది. టర్కీకి చెందిన ఒక సంస్థ ఆ ఫోటో చూశాకా ఆ బాలికతో పాటు తండ్రికీ కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు మందుకొచ్చింది.