Categories
పంచదార ,మైదా ,అన్నం ,ఉప్పు ఈ నాలుగింటినీ వైట్ డెవిల్స్ అంటారు.ముఖ్యంగా చక్కెర తో ఎన్నో నష్టాలు . దీన్ని మానేయటాన్ని షుగర్ డిటాక్స్ పద్దతి అంటారు. మొదటి నలభై రోజులు పంచదార ముట్టుకోకుండా ఉండగలిగితే ఇక శరీరం అలవాటు పడుతుంది.అప్పుడు సహజ చక్కెర లకు కూడా దూరంగా ఉండాలి. క్యారెట్ ,బీట్ రూట్ ,అంజీరా ,ఖర్జురం వంటి వాటికీ దూరంగా ఉండాలన్నమాటా.సాధారణంగా ఇది చాలా కష్టం అలాంటప్పుడు రోజువారీ పంచదార స్థాయిలు నెమ్మదిగా తగ్గిస్తూ రావాలి.ఆకలేస్తే శరీరం స్వీట్ కోరుతుంది. ఏదైనా పండు తిని నీళ్ళు తాగాలి ఎలాగోలా చెక్కరను అతి తక్కువ వాడేలా శ్రధ్ధ తీసుకోవాలి.