Categories
ఫుల్ ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులు చాలా భాగం మంచి శరీర లావణ్యాన్ని ఇస్తాయంటున్నారు. సాధారణంగా శరీరం బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకొనేవాళ్లు లో ఫ్యాట్ పెరుగు స్కిమ్డ్ మిల్క్ వంటి వాటినే తీసుకొంటారు. కానీ కొద్దిగా కార్డ్స్ ,కొంచెం ఫ్యాట్ ఉండే డెయిరీ పదార్థాలు తినటం బెటర్ .ఫుల్ ఫ్యాట్ డెయిరీలో కంజుగేటెడ్ లినో లీక్ యాసిడ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచి అతిగా తినకుండా రక్షిస్తాయి. అందుకే ఫుల్ ఫ్యాట్ డైయిరీ ఉత్పత్తులను తీసుకోవటం వల్ల లాభమే నంటున్నారు డైటీషియన్లు.