Categories
చాలా కాలంపాటు అలవాటుగా డ్రెస్ లు వేసుకున్న కాస్త పెద్దయ్యాక చీరెలు కడితే బావుండనిపిస్తుంది.కనీసం కొన్ని ప్రత్యేక సందర్భాలలో కట్టుకునేందుకు చేనేత రకాల చీరెలు ఎంచుకోవచ్చు. బ్లౌజ్,కాలర్ నెక్ తో ఇకాత్,కలంకారీ వస్త్రశ్రేణి ఎంచుకుంటే చాలా బావుంటుంది. చీరె ప్రింట్ అయితే బ్లవుజ్ సాదాగా కాస్త ప్రత్యేకంగా ఉండాలంటె సాదా చీరెకు బారీ ఎంబ్రాయిడరీ బ్ల్లవుజ్ అయితే ఇంకాస్త బావుంటుంది. లేత రంగుల్లో పట్టు ఫ్యాన్సీ చీరెలు బావుంటాయి. సాయంత్రం వరకు నలిగిపోకుండా ఉండాలంటే సిల్క్,జార్జెట్ తరహా చీరెలు ఎంచుకోవచ్చు. మెడ మూసేసినట్లు బ్లౌజ్ ఉంటే కాస్త బొద్దుగా కనిపించే ప్రమాదం ఉంది. బోట్ నెక్,వీ నెక్,డీప్ నెక్, బ్యాక్ ఓపెన్ వంటివి ట్రయ్ చేయోచ్చు.