Categories
పిజ్జా బేస్ తెచ్చి ఇంట్లోనే పిజ్జా తయారు చేసి ఇస్తే ఇది చాలా పోషకాలతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటున్నాయి పరిశోధనలు. అనేక రకాల ల్యూపింగ్స్ వల్ల కాల్షీయం,ప్రోటీన్లు,విటమిన్లు,థియామిన్,రైబో ఫ్లోవిన్,నియాసిన్ క్యాలరీలను ఇస్తాయి. అయితే ఇది వాడే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఇంట్లో తయారు చేస్తే బ్రకోలి,క్యాప్సికమ్,కార్న్ ,పన్నీర్ వంటి కూరగాయల్ని వాడితే మరింత ప్రయోజనాలు ఉంటాయి. పిజ్జాలో వాడే ప్రతి పదార్ధం పిల్లలకు సమతూల ఆహారం ఇచ్చేదిగా ఉండాలి. పిజ్జాలు పిల్లలు ఇష్టపడే ఆహారం కనుక ఆ రూపాన్ని మార్చకుండా వాళ్ళకు ఆరోగ్యకరమైన పదార్ధాలని చేర్చి ఇంట్లోనే బెక్ చేసి ఇస్తే మంచిది.