Categories
పురి విప్పుకొన్న నెమలి అందానికి ప్రతీక . అంత చక్కని నెమలి నగ్లో మెరిస్తే ఇంకెంత ప్రత్యేకంగా ఉంటుంది. బంగారంతో నెమలిని చెక్కటం కాస్త కష్టమే. జూకాలు, నెక్లెస్ సెట్ లో ఇప్పుడు నెమలి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. నగల్లో ఈ నెమలి చెక్కటం వల్ల కాస్త తరుగు పోతుంది కానీ నగల్లో పొదిగిన నెమలి అందం మాత్రం అద్భుతం. నెమలిని నిండుగా కనిపించేలా చేసేందుకు మెజనైట్స్ రుబీన్, ఎగురాల్ట్స్ వాడుతారు. ఈ రాళ్ళ అందంతో బంగారు నెమలి ఆభరణం అందంగా ఉంటుంది. కానీ మరీ భారీగా ఉంటే బావుండదు. పీకాక్ నెక్లెస్ సెట్ గా ఇస్తారు కనుక చక్కని చిన్న నెమలి ఉండేలా చూసుకొంటే బావుంటుంది. పండగ వేడుకల్లో నిండుగా కనిపించేందుకు ఇంచక్కని నెమళ్ళ బోర్డర్ పట్టు చీరెలతో పీకాక్ సెట్ చాలా బావుంటుంది.