వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం చర్మం పైన శారీరం పైన కనబడుతుంది. చర్మం పైన ఏర్పడే ముడతలు, గీతాలు, పెరిగే వయస్సుని చూపిస్తాయి. మరి అలాంటివి రాకుండా ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ గా ఉండవచ్చు. వయస్సు ప్రభావం ముందుగా జుట్టు పైన పడుతుంది. జుట్టు వుడటం మొదలు పెడుతుంది. ఈ సమస్య పోయేందుకు నాణ్యమైన కండీషనర్స్ సహజ సిద్ధమైన పద్దతుల్లో జుట్టుని పోషించుకోవడం చాలా ముఖ్యం. అలాగే వయస్సు చెప్పే ముడతలు, నల్లటి వలయాలు రావడానికి కారణం మానసికమైన వత్తిడి. ముందు ఎలాంటి సమస్యల్లో అయినా విపరీతంగా టెంషన్ కు గురవ్వటం మానుకోవాలి. చర్మానికి తగిన పోషణ ఇవ్వాలి. వారానికి ఒక్కసారితాజా పండ్లతో ముహానికి పూత వేసుకోవాలి. మంచి నీళ్ళు తాగాలి. ఇవే చర్మాన్ని నవ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. శరీర తత్వానికి సారి పడే అలంకరణ ఎదో చూసుకోవాలి. వాడె రంగులు, పదార్ధాలు, అలంకరణ సామాగ్రి ఎంపికలో జాగ్రత్త పడాలి.

Leave a comment