Categories
తల్లి మంచి ఆరోగ్యంగా ఉంటే ,ఆమె కన్నాబిడ్డల్లో ఆడపిల్లలు ఆరోగ్యంగా గుండె జబ్బులు ,డయాబెటిస్,పక్షవాతం ,ఎముకల బలహీనత లేకుండా ఉంటారట.తల్లి దీర్ఘయుష్షుతో ఉంటే కూతురు అంతే ఆయుష్షుతో ఉంటుందని అధ్యయనాలు స్పష్టంగా చెపుతున్నాయి.తల్లిదండ్రులు ఇద్దరూ దీర్ఘకాలం జీవించినా కూతుళ్ళు కూడా అలా జీవించే అవకాశాలే ఎక్కువ. ఇది జన్యుపరమైన లక్షణం కాదని తల్లి ఎక్కువ కాలం జీవిస్తే ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లు తీపుకొనే చక్కని పోషకపదార్థాలు తిండి ,నిద్ర అలవాట్లు సహాజంగా కూతుళ్ళు కూడా అలవర్చుకొని అంతే ఆరోగ్యంగా ఉంటున్నారని అధ్యయనాలు తేల్చాయి.