బసవరాజుకు తన కూతురు ధానేశ్వరి అంటే ప్రాణం.కర్ణాటక రాష్ట్రం కాలాబుర్గి జిల్లా ముక్తంపురాలో హై స్కూల్ లో చదువుకుంది.అనారోగ్యంతో ధానేశ్వరి మరణించింది. ఆమే మరణాన్ని తట్టుకోలేక బసవరాజు రోజు ఆ స్కూల్ కి వెళ్ళి ఆ పిల్లల్లో తన కూతురు ని చూసుకునేవాడు.ఓ రోజు సాయంత్రం ఆ స్కూల్లో ఉండే 45 మంది అమ్మాయిలను స్కూల్ ఫీజు కట్టలేదని స్కూలుకు రావద్దని చేప్పేశాడు ఫ్యూన్. ఆ స్కూల్ ఫీజు కూడా నామమాత్రమే ఆ కాస్త డబ్బు కట్టలేదు ఆ పిల్లలు. అది చూసి బాధపడ్డ బసవరాజు ఆ పిల్లలందరి ఫీజు కట్టేశాడు. ఈ సంవత్సరం మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం ఫీజు కట్టలేని పిల్లలకు తానే ఆ ఫీజు కడతానని చెప్పి డబ్బు స్కూలు అకౌంట్ లో జమ చేశాడు. పోయిన తన కూతుర్ని ఇంతమంది పిల్లల్లో చూసుకున్న బసవరాజు జన్మధన్యం . ధనేశ్వరిని ఈ రకంగా ఆ పిల్లల మనసుల్లో చిరంజీవి ని చేశాడు బసవరాజు.