Categories
నువ్వుల నూనె పేరు వింటే వంటలు గుర్తోస్తాయి. కానీ ఇది కేశ సౌందర్యాన్ని వెయ్యింతలు చెస్తుంది అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు,ఒమేగా ప్యాట్ ఆమ్లాలు,విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.నువ్వుల నూనె జుట్టుకు సహాజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇందులో ఒమేగా 2,6,9 ప్యాట్ ఆమ్లాలు, విటమిన్లు వెంట్రుకల కుదుళ్ళకు కావలసిన పోషణ ఇస్తాయి. ఇది మంచి హెయిర్ కండిషనర్. జీవం కోల్పోయిన జుట్టుకు పోషణ ఇస్తుంది. సరాసరి నువ్వులను తీసుకొని బాగా దంచి ముద్దగా చేసి పెరుగు ,తేనెలో కలిపి
ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తేచాలు ఓ అరగంట అలా వదిలేసి తలస్నానం చేసేస్తే జుట్టు మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈనూనె వంటికి కూడా మంచిదే.