![కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.](https://vanithavani.com/wp-content/uploads/2016/11/mullangi.jpg)
తెల్లగా పొడుగ్గా దుంపలాగా ఉంటుంది కానీ ముల్లంగి దుంపల కూర కాదు. ఇది క్యాబేజీ ,బ్రాకోలి,కాలిఫ్లవర్ కుటుంబానికి సంబంధించింది. క్యాలరీలు తక్కువ , పీచు చాలా ఎక్కువ .ముల్లంగిలో శరీరానికి డీ టాక్సీఫై చేయటానికి విటమిన్ సి ,ఫోలిక్ యాసిడ్ ,యాంతోసినిన్ వల్ల యాంటీ కాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ పరఫరా చేస్తుంది. ముల్లంగి ప్రతిరోజూ తీసుకొనే ఆహారంతో చేర్చటం వల్ల రకరకాల కాన్సర్ లకు దూరంగా ఉంచుతుంది. బరువు తగ్గాలను కొనే వారికి ప్రయోజనం విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఉడికించకుండా పచ్చిగా సలాడ్స్,జ్యూస్ రూపంలో తీసుకొంటే ఈ విటమిన్ ను శరీరం గ్రహించగలుగుతుంది. ఒత్తిడి ని తగ్గించగల యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో పుష్కలంగా ఉన్నాయి.