Categories
దక్షిణాఫ్రికా మహిళ బోంగిశ్యకొట్ట రాముశ్యాన వైజాగ్ జూనియర్ లిటరసీ ఫెస్ట్ లో పాల్గొన్నారు. స్టోరీ టెల్లింగ్ లో ఆమెకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. స్టోరీ టెల్లింగ్ ,కార్టూన్లు ఇలా పద్దతి ఏదైనా నైతిక విలువలు ,సమాజ పోకడలు గురించి పిల్లల్లో చిన్నప్పటి నుంచి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంలో నేను స్టోరీ టెల్లింగ్ ఎంచుకొన్నాను అంటారామె. పిల్లలలకు కథలు చెపుతూ మధ్య మధ్యలో ఆఫ్రికన్ సౌండ్స్ చేస్తూ పిల్లల దృష్టిని తన వైపు మళ్ళించుకొంటానని చెప్పే ఈమె ఎందరో స్టోరీ టెల్లింగ్ ఎక్స్ పర్ట్స్ ను సృష్టించాలి .ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్న పిల్లలకు మాతృభాష దూరం చేయకూడదు అంటారామె. మానవ సంబందాలు,విలువలు పిల్లలకు నేర్పేందుకు కథలు చెప్పటం మార్గం అంటున్నారామె.