సెలబ్రిటీల పిల్లలకు కూడా పుట్టుకతోనే సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. తైమూర్ ఆలీఖాన్ బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్ ,కరీనా కపూర్ ల ముద్దుల బిడ్డ పుట్టిన దగ్గరనుంచి సామాజిక మధ్యమాల్లో ఫోటోల్లో మెరుస్తునే ఉన్నాడు. ఆ చిన్న బాబుకు చక్కని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అతని క్రేజ్ ను మార్కెట్ క్యాష్ చేసుకోకుండా ఉంటుందా? తైమూర్ ను పోలిన బొమ్మలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ బొమ్మలను నిర్మాత అశ్విని యార్ట్ ట్వీట్ చేస్తే ,బహుశ మా తైమూర్ పేరుని ట్రెడ్ మార్క్ చేయించాలేమో అన్నాడు తండ్రి సైఫ్ . కరీనా మాట్లాడుతూ తైమూర్ కు రెండేళ్ళు వాడి బాల్యం చాలా అద్భుతంగా ఉండాలని ,సెలబ్రిటీ గా వాడు పెరగనక్కర్లేదని ఎంతో జాగ్రత్తా తీసుకొన్నాం. కానీ అంఇదరూ తైమూర్ ని ప్రేమిస్తున్నారు.ఫోటోలు వద్దు బొమ్మలు చేయవద్దు అని దాన్ని ఆపలేను, కానీ తైమూర్ ని ఆశీర్వదించండి అంటోంది.