అస్తమానం ఒకే మాదిరి వర్క్ అవుట్స్ చేస్తే బోర్ కొట్టేస్తుందని కొత్త కొత్త ఫిట్ నెస్ ఫ్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫిట్ నెస్ బాక్సింగ్ కలిపి చేసే విక్సడ్ మార్షల్ ఆర్ట్స్ వల్ల శరీరం బరువు తగ్గి శరీరక సామార్థ్యం పెరుగుతోంది అంటున్నారు. బలమైన తాడు ,ఫ్యాబ్రిక్ సాయంతో ,సస్పెన్షన్ ట్రైనింగ్ వల్ల కండరాలు ధృఢంగా తయారవుతాయి. బోసుబాల్ వర్కవుట్స్ అనే కాస్త కష్టంగానే కీళ్ళు చాలా బలంగా అయిపోతాయి. శరీరాన్ని బాలెన్స్ చేసుకొంటూ చేసే వ్యాయమాలు ఉత్సాహం ఇస్తాయి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అయితే కండరాల సైజు పెంచుతోంది. ఇక డాన్స్ వర్కవుట్స్ అయితే ముందుగా మానసిక ప్రశాంతత దానితో పాటు శరీరపు కొవ్వు చాలా తేలిగ్గా కరిగిపోతుంది.

Leave a comment