Categories
అప్పుడప్పుడు ఉపవాసాలు మంచివే అంటున్నారు అధ్యాయనకారులు. తాజా పరిశోధనలో ఈ అంశాలు నిర్ధారిస్తున్నాయి. ఉపవాసలు చేయడం వల్ల లేదా తక్కువ క్యాలరీలు తిసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే కీటోన్లు రక్త నాళాలపై వయస్సు ప్రభావం పడకుండా కాపాడతాయంట. అంతేకాక గుండే జబ్బులు,క్యాన్సర్ అల్జిమర్స్ వంటి రిస్క్ లు తగ్గిపోతాయి అని శాస్త్రియ అంశాలలో వివరిస్తున్నారు. ఎక్కువ శాతం శారీరక శ్రమలేని ఉద్యోగాల్లో నిరంతరం కూర్చోని చేసే పనులు వల్ల బరువు పెరగడం సహజం . అలాంటి జీవన విధానంలో కూడ ఉపవాసం మేలు చేస్తుంది అని పరిశోధనలు చెప్తున్నాయి.ఉపవాసం అంటే పూర్తి స్ధాయిలో భోజనం మానేయడం కాదు.తక్కువ క్యాలరీలు ఉన్న సులభమైన భోజనం తీసుకోమంటున్నారు.