Categories
తియ్యని పదార్ధాలంటే పిల్లలకు చాలా ఇష్టం .ఈ రోజుల్లో టీనేజర్లపై చదువు భారం ఎంతో ఉంటుంది. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. రోజుకు రెండు సార్లు పాలు ఇవ్వాలి. పాలల్లో కలిపే చక్కెర ,పండ్ల రసాల్లో పంచదార ,ఇవికాక నేరుగా తినే తియ్యని పదార్ధాలతో అన్నికలిపి తీపి వాడకం ఎక్కువవైపోతుందని తల్లులు బాధపడతారు. కానీ టీనేజ్ పిల్లలకు కొంత పంచదార ఇవ్వచ్చునని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.ఒక టీ స్ఫూన్ అంటే నాలుగు గ్రాములు. ఈజీగా ఓ పదిగ్రాముల పంచదార వాళ్ళకు ఆహారంలో ఇచ్చిన పర్లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.