Categories
హై హీల్ షూ వేసుకోవటం చాలా ఇష్టమైతే ఒక చిన్న ఎక్సర్ సైజ్ తో పాదాలకు వచ్చే ముప్పు తగ్గించుకోవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. హై హీల్స్ షూతో ఎక్కువ సేపు నడిస్తే మడమకి పాదంలోపల ఉండే బాల్ మధ్య మృదువైన కండరాలు కుంచించుకు పోయి నడకలో తేడా వస్తుంది. ఎత్తు మడమల చెప్పులు ధరించి రోజంతా తిరిగే వాళ్ళు గోడకు కొంచెం దూరంలో నిలబడి ఒక అడుగు వెనక్కి వేయాలి. అప్పుడు మడమ కిందనే ఉంచి స్ట్రెచ్ చేయాలి. మరో పాదం గోడకు ఆనించాలి. నెమ్మదిగా గోడవైపుకు రెండు కాళ్ళ తుంటి భాగాలు ముడవాలి. ఈ విధంగా ఒక కాలు తర్వాత ఇంకో కాలు 90 సెకన్లు ఆగాలి. అలాగే వీలేనప్పుడల్లా చదరంగా ఉంటే నేలపై నడవాలి. అప్పుడు చెప్పులు వదిలేసి నడవాలి.