Categories
ఒత్తయిన చక్కని శిరోజాలు కావాలంటే ఆహారానికి మించిన ఆప్షన్ ఏది లేదు. శిరోజాల ఎదుగుదలలో ప్రోటిన్లది కీలక పాత్ర. రోజు మోలకెత్తిన గింజలు తింటుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చేపలు ఇతర సీ ఫుడ్ అరోగ్య పూరిత శిరోజాల ఎదుగుదలకు ఉపకరిస్తాయి. ఆముదం కొబ్బరి నూనె కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.కొబ్బరి పాలు అన్నింటికంటే మంచిది. వారానికి ఒక్కసారి అయిన తలకి పట్టించి మసజ్ చేస్తే జుట్టు చక్కగా ఉంటుంది. తరచూ తల స్నానం చేస్తే మాడు డ్రై గా అయిపోతుంది. క్రమం తప్పకుండా గోరు వెచ్చని నూనె తలకు పట్టించాలి. జుట్టు పలచగా ఉంటే ఆముదం అప్లయ్ చేసి మసజ్ చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.