నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మంలో ఎంతో మార్పు తెస్తుందని ముఖ్యంగా కొన్ని నునెలలో నలుగుతో మృత కణాలతో పాటు చర్మం మెరుగ్గా ఉంటుందటున్నరు ఎక్స్ పర్ట్స్ . ఆలీవ్ నూనెతో నలుగు పెడితే ఎండ కారణంగా ఎర్పడే నల్ల మచ్చలు అదుపులో ఉంటాయి. చర్మం కోమలంగా యవ్వన కాంతి తో ఉంటుంది. బాదం నూనెతో అయితే చర్మం తేమగా మృదువుగా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె ముఖం పైన పేరుకున్న దుమ్ము దుళిని తోలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఆముదంలోని మాంసకృతులు,ప్రోటిన్లు జుట్టుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి.దీన్ని కొబ్బరి నూనెతో కలిపి నలుగు నూనెగా వాడితే చర్మం యవన కాంతితో ఉంటుంది.

Leave a comment