Categories

వాయు కాలుష్యం వల్లనే మధుమేహం భారీన పడుతున్నారని ఐక్య రాజ్య సమితికి చెందిన పర్యవరణ బృందం చైనా కాలుష్య మండిలి కలిసి పదకొండేళ్ళ పాటు చేసిన అధ్యయనాలు తేల్చారు. గాలిలో క్యూబిక్ మీటర్ కు 10 మైక్రో గ్రాముల కాలుషిత వాయువులు ఉంటే మధ్య వయస్సు లైన స్త్రీలు ,బరువు తక్కువగా ఉన్నా వాళ్ళు అత్యధిక శాతం మధుమేహనికి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనం చెపుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది షుగర్ వ్యాధికి గురవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిపిన ఈ అధ్యయనంలో అనువంశితతో పాటు జీవనశైలి లో వచ్చిన మార్సుల మూలంగా ఎంతో మంది ఈ అనారోగ్యం బారీన పడుతున్నారు.ఇతర కారణాలతో పాటు వాయు కాలుష్యం కూడా ప్రధానంగా ఉందని పరిశోధకులు అంటున్నారు.