Categories
చర్మం పైన ఎండ ప్రభావం ఎంతో ఉంటుంది. అలాగే జుట్టు కూడా జీవం లేనట్లు అయిపోతుంది.తెనె మొహానికి పట్టించి మర్ధన చేసి ఆరిపోయిన కడిగేస్తే చర్మం తాజాగా మృదువుగా మారిపోతుంది.చర్మం ఎండవేడికి నల్లగా అయిపోతే చెంచా చొప్పున రోజ్ వాటర్,నిమ్మ రసం,కీరదోస రసం కలిపి ముఖానికి రాసి మర్ధన చేయాలి.కాసేపయ్యాక కడిగేస్తే చాలు నిమ్మరసం బ్లీచ్ లాగా పని చేసి నలుపును తొలగిస్తే కీరదోస,రోజ్ వాటర్ చర్మానికి చల్లదనం ఇస్తాయి.జుట్టు పొడిబారినట్లు ఉంటే బాగా పండిన అరటిపండు గుజ్జులో గుడ్డు సొన కలిపి తలకు ప్యాక్ వేసుకుని ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది