Categories
ఫ్లోరల్ ధోతి టాప్ కాలేజీ అమ్మాయిలకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ప్రెషర్స్ పార్టీ దగ్గర నుంచి కాలేజీలో జరిగే ప్రతి వేడుకలకు ఈ డ్రెస్ బావుంటుంది. జార్టెట్ ,సిఫాన్,సిల్క్ వంటి వస్త్రశ్రేణి ఈ డ్రెస్ లకు సరిగ్గా సరిపోతుంది. ఈ దుస్తులపైకి చక్కని స్టడ్స్ ,బన్ని హాంగింగ్స్ బాగా నప్సుతాయి. అలాగే పలాజోలు, స్కర్ట్స్ లు కూడా కాలేజీ అమ్మాయిలకు స్టైలిష్ లుక్ తెచ్చి పెడతాయి. ఇక మిక్స్ అండ్ మ్యాచ్ అయితే హాటెస్ట్ ట్రెండ్ .దుస్తులు యాక్ససరీలు జ్యువెలరీలు భిన్నమైన రంగుల్లో మ్యాచ్ చేసుకొంటే బావుంటుంది.