“కౌసల్య సుప్రజ రామా

పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం.”
    

అందరూ నిద్ర లేచే ఉంటారు కదా!!
సుప్రభాతం వినబడితే మరి నిద్ర పోలేము.
మరి దినచర్య లో మన వైకుంఠ వాసుని పూజ ప్రారంభిద్దామా!!రండి మరి!!

మనలో చాలా మంది జన్మాంతరం పగలు భోజనం చేయరు,సాయంత్రం ఫలహారం చేస్తారు.కొంత మంది అరిటాకులో కాని కంచంలో కాని భోజనం చేయరు,వారు నేల మీద కలుపుకుని తింటూ ఉంటారు.మౌనవ్రతం ఉండడం అనేవి వైకుంఠ వాసుని ముడుపులు.
ధనుర్మాసారంభంలో శేషగిరివాసుడు తెల్ల వారక ముందే పూజలందుకుంటాడు..  శ్రీ దేవి-భూదేవి సహితుడై భూలోకవాసులను ఆపదలు నుండి కాపాడే స్వామీ.
తలనీలాల సమర్పించిన ఆనందం తో  అభయ హస్తం తో వరాలు ప్రసాదిస్తాడు.
పసి పిల్లలకు అన్నప్రాసన పొంగలితో స్వామి  వారి సన్నిధిలో..చేస్తే పరమార్ధం.వైకుంఠవాసి దర్శనానికి వెళ్ళినప్పుడు  పూలు పెట్టుకోకూడదు.అయన సన్నిధిలో ఏ పని  చేస్తున్నా మనసు లో ఏడు కొండల వాడా, వేంకట రమణ గొవింద….గోవింద అని స్మరిద్దాం.

ఇష్టమైన పూలు: అన్నిరంగుల పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

ఇష్టమైన కోరిక: తల నీలాలు ఇవ్వడం,ముడుపులు చెల్లించేప్పుడు కర్పూరంతో సమర్పించడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి,పండ్లు.

పొంగలి తయారీ: పాలు మరిగిన తరువాత  కడిగిన బియ్యాన్ని అందులో వేసి తగినంత బెల్లం వేసి ఉడికించి చివరికి యాలకుల పొడి తో అలంకరించి ఆ వైకుంఠవాసునికి…..

“శ్రీ చక్ర శుభనివాస..స్వామి జగమేలు చద్విలాస..నా స్వామి శృంగార శ్రీనివాస”
అంటూ నైవేద్యం పెట్టటమే….

       -తోలేటి వెంకట శిరీష.

Leave a comment