Categories
కరెంట్ కుక్కర్లు,నాన్ స్టిక్ పాన్ లతో సమంగా ఆధరణ పొందుతున్నాయి మిట్టీ కూల్ పాత్రలు . నిజానికి పూర్వపు వంటలన్నీ మట్టి పాత్రల్లోనే . మట్టిమూకుళ్ళు కుండలు,పోయి స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ వచ్చి చేరింది . కానీ మట్టి పాత్రల్లో వండటంలో ఉండే ఆరోగ్యం గురించి తెలిశాక మళ్ళీ మట్టి పాత్రలకు పూర్వ వైభవం వచ్చింది . మట్టి పాన్లు కుక్కర్లు గ్లాసులు ,నీళ్ళ జాడీలు . కాఫీ కప్పులు ఇలా రకరకాల వస్తువులు మార్కెట్ లోకి వచ్చాయి . గుజరాత్ నుంచి మిట్టికూల్ పేరుతో ఆన్ లైన్ లో అందమైన మట్టి పాత్రలు అమ్ముతున్నారు . మట్టిపాత్రల్లో వండిన బిర్యానీ ,కాచిన పాలు ,తోడేసిన పెరుగు రుచే వేరు . ఇప్పుడు మట్టిపాత్రలు మోడ్రన్ ట్రెండ్ .