ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యం తో ఉంటే వారి బాధ్యత తీసుకునే గృహిణులు చాలా త్వరగా తీవ్రమైన పరిణామాలు ఎదురుక్కుంటారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎవరైనా లేవలేని స్దితిలో ఉంటే ఇక పూర్తిగా వారి సంరక్షణకే సమయం అంతా ఇస్తూ పోవాలి ఆ సమయంలో గృహిణులు తమ సొంత పనులకు నిముషం కూడా కేటాయించుకులేకపోతారు పెద్దల సంరక్షనే జీవితం అయిపోయి పని ఉత్పాదన మూడురెట్లు తగ్గిపోతుంది. ఆ పనుల్లోనే మునిగిపోయి తమను తాము పట్టించుకోలేక పోతే డిప్రెషన్,ఇతర ఆనారోగ్యాల అవకాశాలు ఉంటాయి .అనారోగ్యంతో ఉన్నా కుటుంబ సభ్యుల భాద్యేతే పూర్తిగా ఆమెదే అయిపోతుంది. అధ్యయన కారులు సంక్లిష్ట సమయంలొ గృహిణికి తోడుగా కుటుంబ సభ్యులు నిలవాలి అంటున్నారు. అనారోగ్యం వుంటే పెద్దవాళ్ళని చేసుకోగలిగే ఏజన్సీలు ఫుల్ టైమ్ కేర్ టెకెర్స్ వుంటారు. వాళ్ళ సాయం తప్పని సరిగా తీసుకోవాలి గృహిణికి కొంచం స్వీయ సమయం కోసం అవకాశం ఇవ్వకపోతే ఆమె మూలపడటం ఖాయం అంటున్నారు మార్పులేని తారిక్ లేని పని ఆమెలో నిరాశ పెంచుతోందని, మనసులో సంబషం తగ్గిపోతుందని ఇతర కుటుంబ సభ్యులు దీన్ని పంచుకోవాలని చెపుతున్నారు.
Categories