Categories
మానవ హక్కులు కొత్తవి కావు ,3000 ఏళ్ళ క్రితమే కొన్ని ప్రాంతాల పాలకులు అమలు చేశారు అంటున్నారు చరిత్ర కారులు . పర్షియన్ ప్రాంతం అగ్ని ఆరాధితులైన జురాష్ట్రియన్ ల ఆధీనంలో ఉన్నపుడు , అక్కడి రాజు పైరాస్ తమ దేశంలో ప్రజలకుండే హక్కులు వివరిస్తూ మట్టి పాత్ర పైన ముద్రించాడు . పర్షియన్ భాషలో ఉన్నా అహక్కుల వివరణ ఐపా పర్షియన్ తవ్వకాల్లో లఖిస్తే దాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ లండన్ మ్యూజియం లో భద్రపరిచారు . 22.5 సెంటీ మీటర్ల పొడవు 10 సెంటీ మీటర్ల వెడల్పు లో ఉన్నా ఈ మట్టి పాత్ర పైన ప్రజలు తమకు ఇష్టమైన మతాచారాలను అనుసరించే కళ్ళు ,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తాము కోరుకున్నప్పుడు స్వదేశానికి వెళ్ళే హక్కు ఉంటుందని ముద్రించి ఉంది .