Categories
శ్రీ లలితా శివజ్యోతి సర్వ కామదా…
శ్రీ గిరి నిలయా విరామయ సర్వమంగళా!!
దసరా శరన్నవరాత్రులు ఐదవ రోజు అంటే పంచమి,అమ్మ వారు మనకు శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమవుతుంది.ఈ రోజు కనకాంబరం రంగు వస్త్రధారణ.శ్రీ లలితా సహస్ర నామము స్తోత్రం పఠనం చేయడం వల్ల అమ్మవారి కటాక్షం ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ చేరుకుంటుంది.కుంకుంమార్చన చేసుకుని ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించు కోవాలి…శరన్నవరాత్రులలో వనితలు దాండియా అంటే కోలాటాలు ఆడి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పాయసం.
-తోలేటి వెంకట శిరీష