నల్ల నువ్వులు తిరుగు లేని శక్తి ని ఇస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వార్దక్య లక్షణాలను తగ్గిస్తాయి జాయింట్ నొప్పులకు చక్కని ఉపశమనం. రోజుకు ఒక నువ్వుల లడ్డు తింటే ఎంతో ఆరోగ్యం కూడా . ఇవి చేయటం కూడా చాలా తేలిక. 250 గ్రాముల నల్ల నువ్వులు,150 గ్రాముల బెల్లం తురుము,కాస్త కొబ్బరి కోరు,యాలుక పొడి ,రెండు స్పూన్లు నెయ్యి . నువ్వులు బాగా శుభ్రం చేసి కడిగి ఆరనివ్వలి పాన్ లో సన్నని సెగ పైన మాడిపోకుండా వేగనివ్వాలి యాలకుల పొడి కూడా వేసేయచ్చు. బెల్లం తురుము,కాసిని నీళ్ళు కలిపి సన్నని సెగపై పెట్టాలి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో నువ్వులు వేసి బాగా కలిపేయాలి . అందులోనే కాస్త నెయ్యి వేయవచ్చు . చల్లారిన తరువాత చిన్న చిన్న లడ్డులాగా కట్టుకొని కొబ్బరి కోరుతో అద్దితే చేసేందుకు బావుంటాయి. గాలి దూరని డబ్బాలో పెడితే చాలా రోజులు నిల్వ వుంటాయి. రోజుకు ఒకటి తింటే చాలు ఎంతో శక్తి నిస్తాయి ఈ లడ్డు.
Categories