టెక్నాలజీ సందేహం లేకుండా మన జీవిత గమనానికి మేలు చేస్తుంది . కానీ అదేపనిగా దానికి బానిసలైతేనే ప్రమాదం అంటున్నారు అధ్యయనకారులు . తాజాగా జరిగిన ఒక సర్వే లో 14 నుంచి 15 సంవత్సరాల అమ్మాయిల పైన సమగ్ర పరిశోధన చేశారు . కొద్దీ కాలం వాళ్ళను సోషల్ మీడియా కు దూరం చేశారు . టెలిఫోన్ వాడకం పరిమితం చేశారు . ఆ సమయంలో వారు కేవలం స్నేహితులతో కలుస్తూ,కుటుంబ సభ్యులతో మిగిలిన కాలం గడుపుతూ చదువులో నిమగ్నం అయ్యారు . ఈ మార్పులు వారి మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపించాయి . మెదడులో చురుకుదనం వల్ల చదువులో నుంచి ఫలితాలు కనిపించాయి . ఆన్ లైన్ ప్రబావలకు దూరంగా గడపటం లో వారి ఆత్మవిశ్వాసం అధికమైనట్లు గమనించారు . టీనేజర్లు గంటలకు గంటలు ఫేస్ బుక్ ,ఇన్ స్టాగ్రామ్ లలో గడిపేయటం వల్ల కనీసం ,స్నేహితులతో ,సమాజంతో కూడా బంధుత్వాలు దూరం చేసుకొంటున్నారని అధ్యయనకారులు విచారం వ్యక్తం చేశారు .
Categories